https://navatelangana.com/ Thu, 25 Apr 2024 23:34:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png https://navatelangana.com/ 32 32 గుజార‌త్‌లో అంత ఈజీ కాదు https://navatelangana.com/not-so-easy-in-gujarat/ Thu, 25 Apr 2024 23:19:46 +0000 https://navatelangana.com/?p=277471 – గత ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలిచిన బీజేపీ
– కమలాన్ని దడ పుట్టిస్తున్న అంతర్గత పోరు, ఠాకూర్ల నిరసనలు
– గిరిజనుల ఆందోళనలు కూడా
– కాంగ్రెస్‌, ఆప్‌ అవగాహనతో ‘ఇండియా’ బలోపేతం
– రాహుల్‌ జోడో యాత్ర ప్రభావం
హేమలత
ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా సొంత ఇలాకా గుజరాత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అన్ని సీట్లనూ తమ వశం చేసుకుంది. కాగా ఈ మారు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. గతంలో మాదిరి బిజెపి గెలుపు నల్లేరుమీద నడక కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌, ఆప్‌, బిటిపిల మధ్య ఓట్లు చీలిపోవడంతో బిజెపి గెలుపు సులువైంది. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో ఇండియా బ్లాక్‌లో భాగంగా కాంగ్రెస్‌, ఆప్‌ కలసి బరిలోకి దిగడంతో బిజెపిలో వణుకు మొదలైంది. కొందరు బిజెపి అభ్యర్దులు పోటీ నుంచి విరమించుకున్నారు. అంతేకాదు, కుట్రలు పన్ని ప్రత్యర్ధులను నామినేషన్ల సమయంలోనే తప్పించే ఎత్తులు వేసింది. అందుకు ప్రత్యక్ష ఉదారణ సూరత్‌లో బిజెపి అభ్యర్థి ఏకగ్రీవం. సర్పంచ్‌, వార్డు మెంబర్‌ వంటి వారి ఎన్నిక ఏకగ్రీవం కావడం కద్దు. ఒక ఎంపి స్థానంలో అభ్యర్ధులందరి నామినేషన్లూ స్క్రూటినీలో పోయి ఒక్క బిజెపి అభ్యర్థిది మిగలడం, ఎన్నిక ఏకగ్రీవం కావడం గమనార్హం.
గిరిజన ఓట్లపై కాంగ్రెస్‌ దృష్టి
గిరిజన ప్రాబల్యమెక్కువున్న భరూచ్‌ స్థానంలో కాంగ్రెస్‌కు పట్టు ఉండేది. కానీ, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్‌ గిరిజన నేతలు బిజెపిలోకి ఉడాయించారు. బిటిపి పార్టీ అధ్యక్షుడు మహేష్‌ వసావా బిజెపిలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భరూచ్‌ నియోజకవర్గం పరిధిలోని డేడియాపాడా సీటును ఆప్‌ గెలుచుకుంది. కాబట్టి భరూచ్‌లో ఆప్‌ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. రాహుల్‌ జోడో యాత్ర ఈ గిరిజన ప్రాంతాల గుండానే కొనసాగింది. బిజెపి అభ్యర్థి మన్‌సుక్‌భారు వసావాకు ఆప్‌ చైతర్‌ వసావా గట్టి పోటీ ఇవ్వనున్నారు. కేజ్రివాల్‌ అరెస్టు అవ్వడంతో ఆయన సతీమణి సునీత, పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ కేంద్రమంత్రులు ఆపార్టీ తరుఫున ప్రచారం చేస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాల్లో ఆప్‌ 5, కాంగ్రెస్‌ 17, బిజెపి 156 స్థానాలను గెలుచుకున్నాయి. స్థానిక సంస్థల్లో ఓబీసిల 10 శాతం రిజర్వేషన్‌ను 27 శాతానికి బిజెపి క్యాబినెట్‌ పెంచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం సీట్లను బిజెపి గెలుచుకోగా, బిజెపి 62.21 శాతం, కాంగ్రెస్‌ 32.11 శాతం ఓట్లు సాధించాయి.
బిజెపికి నిరసనల సెగ
బిజెపి ఐదు సిట్టింగ్‌లను మార్చింది. జునాగఢ్‌ స్థానంలో పార్టీ అభ్యర్థిని మార్చాలని అరడజను మంది నాయకులు రాష్ట్ర బిజెపి చీఫ్‌ సిఆర్‌ పాటిల్‌ను సోషల్‌మీడియా ద్వారా కోరారు. రంజన్‌ భట్‌ వడోదరా అభ్యర్థిని మార్చారు. రాజ్‌కోట్‌ అభ్యర్థి వ్యాఖ్యలతో రాజ్‌పుత్‌ల ఆగ్రహానికి గురయ్యారు. సబరికాంతలో బిజెపి అభ్యర్థిపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా ఠాకూర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేడంతో రూపాలకు రాజ్‌కోట్‌ టిక్కెట్‌ ఇవ్వొద్దని ఠాకూర్లు నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాదు, ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయొద్దని తీర్మానించారు. ఠాకూర్ల ఓట్లతో గెలుస్తున్న బిజెపికి ఈ పరిణామం మింగుడు పడట్లేదు. అమ్రేలీలో సిట్టింగ్‌ ఎంపి నారాన్‌ కచ్చదియా, కొత్త అభ్యర్థి భారత్‌ సుతారియిల మద్దతుదారులు బాహాటంగానే తలపడడంతో పార్టీలో అంతర్గత పోరు బయటపడింది. అర్హతను బట్టి కాకుండా కులం ప్రాతిపదికగా అభ్యర్థిత్వం ఖరారు చేస్తుండటంతో అభ్యర్థుల్లో అసంతృత్తి నెలకొంది. బిల్కిస్‌బానో కేసులో దోషులను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. రాష్ట్ర జనాభాలో 38 శాతం పోషకాహార లేమితో బాధపడుతున్నట్లు నీతిఆయోగ్‌ వెల్లడించింది. పట్టణాలే తప్ప గ్రామాల అభివృద్ధి మరచింది. జింక్‌ స్మెల్టర్‌ ప్రాజెక్టు కోసం గిరిజనుల భూముల సేకరణపై వ్యతిరేకత కొనసాగుతోంది. ఇత్యాది ప్రతికూలాలు బిజెపిని వెంటాడుతున్నాయి.
26 స్థానాలకు మే 7న పోలింగ్‌
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు మూడోవిడతలో ఒకేసారి మే 7న పోలింగ్‌ జరగనుంది. ఎంపి ఎన్నికలతో పాటుగా ఐదు అసెంబ్లీ స్థానాలకూ అదే రోజున ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 22న నామినేషన్లు ముగిసేనాటికి మొత్తం 491 మంది లోక్‌సభకు, 39 మంది అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లను దాఖలు చేశారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ 24 స్థానాలోనూ, ఆప్‌ రెండు స్థానాలోనూ పోటీ చేస్తున్నాయి. భరూచ్‌, భవనగర్‌ అనే రెండు ఆప్‌ స్థానాల్లో చైతర్‌ వసావా, ఉమేష్‌ మక్వానాలు పోటీపడుతున్నారు.

]]>
త్రిపురలో 100 శాతానికిపైగా పోలింగ్‌ https://navatelangana.com/more-than-100-percent-polling-in-tripura/ Thu, 25 Apr 2024 23:15:27 +0000 https://navatelangana.com/?p=277468 – రిగ్గింగ్‌కు పాల్పడితేనే ఇలా వందశాతం దాటుతుంది
– రీపోలింగ్‌ నిర్వహించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గంలో, రామ్‌నగర్‌ శాసనసభ స్థానంలో ఈనెల 19న జరిగిన పోలింగ్‌లో వంద శాతంపైగా పోలింగ్‌ జరిగింది. మజ్లిస్‌పూర్‌ సెగ్మెంట్‌లో 105.30 శాతం, ఖాయర్‌పూర్‌లో 100.15 శాతం, మోహన్‌పూర్‌ సెగ్మెంట్‌లో 109.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగలేదని సీపీఐ(ఎం) త్రిపుర శాఖ కార్యదర్శి జితేంద్ర చౌదరి విమర్శించారు. ”పశ్చిమ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికలు, అదే పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన రామ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక స్వేచ్ఛగా, న్యాయంగా, సాధారణ పద్ధతిలో జరగలేదని పైరికార్డులు నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి. బూత్‌లను స్వాధీనం చేసుకున్నప్పుడు, వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తిగా రిగ్గింగ్‌ చేసినప్పుడే ఇటువంటి సరిపోలని పోలింగ్‌ శాతం జరుగుతుంది” అని అన్నారు.
”రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ద్వారా తమ పార్టీకి అందుబాటులో ఉంచిన పోలింగ్‌ స్టేషన్ల వారీగా పోలింగ్‌ రిపోర్టుల నుండి డేటా సేకరించాం. రిటర్నింగ్‌ అధికారికి ప్రిసైడింగ్‌ అధికారి రిపోర్టును అందించే పోలింగ్‌ స్టేషన్ల వారీ డేటా పబ్లిక్‌గా అందుబాటులో లేనప్పటికీ, డిమాండ్‌ను బట్టి దాన్ని యాక్సెస్‌ చేయవచ్చు. అలానే వివరాలు తీసుకున్నాం” అని ఆయన తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు తాజా ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)లు డిమాండ్‌ చేశాయి. పశ్చిమ త్రిపురలో పోలింగ్‌ ముగిసిన కొద్దిసేపటికే లెఫ్ట్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ నారాయణ్‌కర్‌ మాట్లాడుతూ రెండు స్థానాల్లో తాజా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని చెప్పారు. త్రిపుర పశ్చిమ లోక్‌సభ సీటు, రామ్‌నగర్‌ అసెంబ్లీ సీటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో విఫలమవడం, ఎన్నికల సంఘం చేసిన పెద్ద చర్చలు, వాగ్దానాలు చూసి ఆశ్చర్య పోయాం”అని అన్నారు.
పెద్ద ఎత్తున నకిలీ ఓటింగ్‌ను నిరోధించడంలో ఎన్నికల సంఘం విజయవంతమైందని, అయితే గూండాయిజం అదుపు లేకుండా పోయిందని, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాకుండా అడ్డుకు న్నారని కాంగ్రెస్‌ నేత సుదీప్‌ రారు బర్మన్‌ ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి నబెందు భట్టాచార్జీ మాట్లాడుతూ ”మేము డేటాను చూడలేదు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిశీ లిస్తుంది. ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం దానికి కట్టుబడి ఉంటాం” అని అన్నారు.

]]>
మోడీని అనర్హుడిగా ప్రకటించాలి https://navatelangana.com/modi-should-be-disqualified/ Thu, 25 Apr 2024 23:14:02 +0000 https://navatelangana.com/?p=277460 – కేంద్ర ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాని మోడీని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివిధ సభల్లో మాట్లాడుతున్న తీరు జుగుప్స కలిగిస్తున్నదని విమర్శించారు.రాజ్యాంగ బద్ధంగా పాలన చేస్తానంటూ ప్రధానిగా ప్రమాణం చేసి దానికి వ్యతిరేకంగా మతోన్మాదిగా దేశ ప్రజలను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న తీరు ఆయన ప్రధాని పదవికి మచ్చ తెస్తున్నదని తెలిపారు. రాజస్థాన్‌లోని సభలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల చర, స్థిర ఆస్తులను ముస్లింలకు పంచి పెడుతుందంటూ మోడీ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను ఆ పార్టీ తగ్గించి ముస్లింలకు ఇస్తుందంటూ ప్రకటించారని పేర్కొన్నారు. చత్తీస్‌ఘడ్‌లో సామాజిక న్యాయం పేరుతో ప్రజల ఆస్తులను లూటీ చేసే ప్రమాదముందంటూ మోడీ మాట్లాడారని తెలిపారు. ప్రధానిగా ఉండి ప్రజల సంపదను బీజేపీ అదానీ, అంబానీలకు దోచిపెట్టిన దాన్ని తిరిగి ప్రజల ఆస్తులుగా మారుస్తారనే భయంతోనే మోడీ ఈ మాటలు మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. ఆయన దృష్టిలో భారత ప్రజలంటే అదానీ, అంబానీ, నీరవ్‌ మోడీ, విజరు మాల్యా వంటి కొద్ది మంది సంపన్నులు తప్ప 140 కోట్ల మంది కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని మోడీని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ లక్ష్యాలను నిలబెట్టాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్య చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. మూడోసారి మోడీ ప్రధాని అయితే ప్రజలు ఐక్యంగా జీవించడం, దేశం ఐక్యంగా ఉండటం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. మతం ఆధారంగా దేశ ప్రజలను చీల్చటం, మతాల మధ్య చిచ్చు పెట్టటం, తద్వారా దేశ సమైక్యతకు నష్టం కలిగించడమే మోడీ గ్యారంటీగా భావించాలని విమర్శించారు. తెలంగాణ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి రాష్ట్రంలోని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్థానం లేకుండా చేయాలని నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడే దేశం సమైక్యంగా ఉంటుందనీ, రాజ్యాంగం రక్షించబడుతుందని తెలిపారు.

]]>
అంబేద్కర్‌ కోరుకున్న సమానత్వం రాలేదు https://navatelangana.com/ambedkars-desired-equality-did-not-come/ Thu, 25 Apr 2024 23:12:59 +0000 https://navatelangana.com/?p=277465 – ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి
– అంబేద్కర్‌ వర్సిటీలో స్మారకోపన్యాసం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంబేద్కర్‌ కోరుకున్న సమానత్వం రాలేదని ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మారకోపన్యాసాన్ని ఇచ్చారు. అంబేద్కర్‌ చిత్రపటానికి లింబాద్రి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం లింబాద్రి మాట్లాడతూ ప్రపంచ సమానత్వాన్ని అంబేద్కర్‌ కోరుకున్నారనీ, అది ఇంకా రాలేదని చెప్పారు. ఆయన దూర దృష్టి గల నేత అని అన్నారు. రాజ్యాంగంలో పొంచుపర్చిన ఆర్టికల్‌ మూడు ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని వివరించారు. స్వాతంత్య్రానికి పూర్వం అంబేద్కర్‌ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారనీ, అంటరానితనం, వివక్ష ఆయన్ను బాగా ఆలోచింప చేశాయని చెప్పారు. రాజ్యంగం పునాది అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే అంశాలపై ఆధారపడి ఉందని వివరించారు. ప్రాథమిక సూత్రాలుగా భారత రాజ్యాంగ పీఠికలోకి సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం, ఆలోచనలు, భావ వ్యక్తీకరణలో నమ్మకాలు, విశ్వాసాల్లో స్వేచ్ఛ, అంతస్తులు, అవకాశాల్లో తేడాలున్న సమాజంలో అందరి మధ్య సమానత్వం సాధించాలని అంబేద్కర్‌ సూచించారని గుర్తు చేశారు. దేశ రాజకీయాలను, పరిపాలనా విభాగాలను వ్యవస్థలను, వనరులను సమానంగా అందరికీ పంచాలని ఆయన కోరుకున్నారని చెప్పారు. అయితే ఇప్పటికే దేశంలోని సంపద కొందరి వద్దే కేంద్రీకృతం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె సీతారామారావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో 25 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ, త్వరలోనే ఆవిష్కరిస్తామని చెప్పారు. అంబేద్కర్‌ ఆశయాలకు యూనివర్సిటీ కట్టుబడి ఉందని వివరించారు. ప్రభుత్వ పరిపాలన శాస్త్రం 75 వసంతాల అంతర్జాతీయ సదస్సు బ్రోచర్‌ను లింబాద్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎవిఆర్‌ఎన్‌ రెడ్డి, డీన్‌ వడ్డాణం శ్రీనివాస్‌, సెమినార్‌ డైరెక్టర్‌ పల్లవి కబ్డే, కో డైరెక్టర్‌ సి వెంకటయ్యచ సీఎస్‌టీడీ డైరెక్టర్‌ ఆనంద్‌ పవార్‌, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ ఎల్వీకే రెడ్డి, పుస్తక ప్రచురణల విభాగం డైరెక్టర్‌ గుంటి రవీందర్‌, ఎస్సీ,ఎస్టీ సెల్‌ ఇన్‌చార్జీ బానోత్‌ ధర్మ తదితరులు పాల్గొన్నారు.

]]>
దేశ ద్రోహులకు కాంగ్రెస్‌ ఏజెంట్‌ https://navatelangana.com/congress-agent-for-traitors/ Thu, 25 Apr 2024 23:10:55 +0000 https://navatelangana.com/?p=277456 – తెలంగాణు ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నరు: ఎన్‌.రామచంద్రరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశద్రోహులకు ఏజెంట్‌గా కాంగ్రెస్‌ పార్టీ మారిందని మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన దాంట్లో ఒక్క చార్జీ లేదు..షీటూ లేదు అని విమర్శించారు. తమది ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం అని సగర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. కాంగ్రెస్‌ భావజాలమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ దేశ వ్యతిరేక విధానాలు తీసుకున్నదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే అలవాటు కాంగ్రెస్‌దనీ, అనేకసార్లు సవరించిందని గుర్తు చేశారు.ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను హరించిందని కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. రాహుల్‌గాంధీ తెలంగాణలో చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదనీ, ప్రజలు కొట్లాడి సాధించికున్నారని తెలిపారు. తెలంగాణ ముందే ఇచ్చిఉంటే ఇన్ని బలిదానాలు జరిగేవి కావన్నారు. తాము ఇప్పటివరకూ రిజర్వేషన్లు పెంచాం తప్ప తీసెయ్యలేదని చెప్పారు.

]]>
ప్రశ్న తెలివిని పెంచుతుంది https://navatelangana.com/question-raises-intelligence/ Thu, 25 Apr 2024 23:09:53 +0000 https://navatelangana.com/?p=277458 – సమాధానం చెప్పలేనప్పుడే విసుగు
– విధ్యాబోధనలో నిరంతర ఆధునీకరణ అవసరం : టీచర్స్‌ వర్క్‌షాప్‌లో ప్రముఖ కవి సుద్దాల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ప్రశ్న అభివృద్ధికి సూచిక. అది తెలివిని పెంచుతుంది. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేనప్పుడే మనిషిలో అసహనం, విసుగు, అక్రోశం పెరుగుతుంది’ అని ప్రముఖ కవి సుద్దాల అశోక్‌ తేజ అన్నారు.గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం ఆధ్వ ర్యంలో ‘విద్యా బోధనలో నిరంతరం ఆధునికతను అందు కుందాం’ అనే అంశంపై ఉపాధ్యాయుల వర్క్‌షాప్‌ను బాలోత్సవ కమిటీ ఉపాధ్యక్షులు మమత అధ్యక్షతన నిర్వ హించారు.ఈ సందర్భంగా అశోక్‌ తేజ మాట్లాడుతూ ఉపా ధ్యాయులు బహుముఖ ప్రజ్ఞాశాలురుగా ఉండాలని సూచిం చారు.విద్యార్థుల హావ భావాలను అర్థం చేసుకోవాలన్నారు. వాస్తవానికి పిల్లలే ఉపాధ్యాయులకు ఎన్నో విషయాలు నేర్పిస్తారని వివరించారు. ఒక కార్యం వెనుక అనేక కారణాలుంటాయనీ,ఆ కారణాలను అర్థం చేసుకునే చైతన్యాన్ని ఉపాధ్యాయులు అలవర్చుకోవాలని చెప్పారు. విద్యార్థులతో సాదాసీదాగా ఉపాధ్యాయులు వ్యవహరిస్తే సృజనాత్మకతను వెలికి తీయలేమన్నారు. వారి జీవన నేపథ్యం, సామాజిక, ఆర్థిక స్థితిని అధ్యయనం చేయాలని సూచించారు. అప్పుడే ఏ విద్యార్థికి ఏ స్థాయిలో విద్యనందించగలమో అర్థమవుతుందని తెలిపారు.’ తరగతి గదిలోనే దేశ భవిష్యత్‌ నిర్దేశించబడుతుంది’ అని చెప్పిన కోఠారి మాటల్లో అర్థాన్ని ఒడిసి పట్టుకోవాలని సూచించారు. పిల్లవాడికి ఏ రూపంలో చెబితే..ఆ పాఠ్యాంశంలోని సారాన్ని గ్రహించగలడన్న విషయాలు ..ముందు మనకు అర్థం కావాలన్నారు. అందుకే ఉపాధ్యాయులు బహుపాత్రలు పోషించే టీచర్‌గా అభివృద్ధి కావాలన్నారు. పిల్లలు టీచర్‌ను నమ్మినంతగా తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా నమ్మరని ఉదాహరణలతో సహా వివరించారు. కార్యక్రమంలో మోటివేటర్‌ గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హావభావాలు, బాడీలాంగ్వేజ్‌తో పాటు విద్యార్థులను సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. స్లేట్‌ స్కూల్‌ చైర్మెన్‌ వాసిరెడ్డి అమర్‌నాధ్‌, అనురాగ్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, బాలోత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్‌ సోమయ్య, ఉపాధ్యక్షులు సుజావతి, రూప, జి బుచ్చిరెడ్డి, నాయకులు పద్మ, గీతారాణి, నవీన్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

]]>
బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లుండవు… https://navatelangana.com/there-will-be-no-reservations-if-bjp-comes-again/ Thu, 25 Apr 2024 23:07:09 +0000 https://navatelangana.com/?p=277455 – అందుకే 400 సీట్లు అడుగుతోంది
– ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్నే ఆ పార్టీ అమలు చేస్తుంది
– ఈ ఎన్నికలు రిజర్వేషన్ల కొనసాగింపుపై రిఫరెండం
– ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీకి భయం పట్టుకుంది
– నాడు మండల్‌ అంటే కమండల్‌ అన్నది
– రిజర్వేషన్లు కావాలనే నేతలు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలి
– దేశాన్ని ఎక్స్‌రే తీస్తాం…వారి వాటా వారికిస్తాం… : బీజేపీపై చార్జిషీట్‌ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. లోక్‌సభలో 400 సీట్ల భారీ మెజార్టీ సాధించడం ద్వారా రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనతో ఉందని చెప్పారు. రిజర్వేషన్లు కొనసాగించా లనేది కాంగ్రెస్‌ నిర్ణయమనీ, దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లు కొనసాగించాలా? వద్దా? అనేది ఈ ఎన్నికల్లో రిఫరెండం అని తెలిపారు. తమ పార్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ‘నయవంచన- పదేండ్ల మోసం…వందేండ్ల విధ్వంసం’ అంటూ బీజేపీపై నాలుగు పేజీల చార్జీషీట్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, జగ్గారెడ్డి, నాయకులు జి నిరంజన్‌తో కలిసి సీఎం రేవంత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన చేపట్టి దేశాన్ని ఎక్స్‌రే తీస్తామంటూ రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే కొంత మంది నేతలు బీజేపికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో, వారికి ఓటు వేయాలని ఎందుకు కోరుతున్నారో అర్థం కావడం లేదంటూ మందకృష్ణనుద్దేశించి పరోక్షంగా చురకలంటించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దని హితవు పలికారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమేనన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనను దేశంపై రుద్దేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని విమర్శించారు. వందేండ్లలో రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించిన రోజే నిర్ణయించుకుందని తెలిపారు. తమకు మెజార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభమవుతుందనే ఉద్దేశంతోనే మోడీ 400 సీట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఆయన దేశాన్ని మోసం చేశారని విమర్శించారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే అదానీ, ప్రధాని అంటూ ఎద్దేవా చేశారు. పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.
రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలి
ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతాన్ని 50 శాతానికి పెంచుతామంటూ రాహుల్‌గాంధీ ప్రకటించడం తో బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారని వివరించారు. మండల్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్‌ ఉద్యమాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందని హెచ్చరించారు. రిజర్వేషన్లు ఉండాలనుకునే వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలనీ, వద్దు అనేవాళ్ళు బీజేపీకి ఓటేయాలని రేవంత్‌ సూచించారు. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ చూస్తున్నారని విమర్శించారు.
మోడీ చేసిన అప్పులే ఎక్కువ..
దేశంలో గత 14 మంది ప్రధానుల కంటే మోడీ చేసిన అప్పులే ఎక్కువ అని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. పదేండ్లలో రూ.113 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. దేశ ప్రజలపై రూ. 168 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశారు. కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమన్నారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న ప్రధాని…పార్లమెంటు సాక్షిగా అన్నదాతలకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. చేనేత నుంచి కుటీర పరిశ్రమ వరకు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతోందన్నారు. అగ్గిపెట్టె, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నట్టు చివరకు అగర్‌బత్తీలపై కూడా జీఎస్టీ వేసిందన్నారు. 60 ఏండ్లలో కాంగ్రెస్‌ కూడబెట్టిన ఆస్తులను మోడీ పదేండ్లలో కార్పొరేట్లకు కట్టబెట్టారని విమర్శించారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తా నన్న ప్రధాని పది పైసలు కూడా తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెట్రోల్‌ ధర రూ. 55 నుంచి రూ.110 వరకు పెరిగిందన్నారు. జీఎస్టీ పేరుతో మోడీ దోపిడీ చేశారని విమర్శించారు. చిన్న పిల్లల పెన్సిల్‌, రబ్బర్‌లపై కూడా జీఎస్టీ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేశారన్నారు.

]]>
బంగారం కొనలేని స్థితిలో మహిళలు https://navatelangana.com/women-are-unable-to-buy-gold/ Thu, 25 Apr 2024 23:03:41 +0000 https://navatelangana.com/?p=277448 yeadav– మోడీ మంగళసూత్రాల విమర్శలపై తేజస్వీ యాదవ్‌ స్పందన
పాట్నా: భారీగా పెరుగుతున్న ధరలతో దేశంలో అనేక మంది మహిళలు బంగారం కొనలేని స్థితిలో ఉన్నా రని, ఇక ‘మంగళసూత్రాలు’ గురించి మాట్లాడం ఎందుకని ప్రధానమంత్రి మోడీని ఆర్జేడీ నాయకులు తేజస్వియాదవ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల నుంచి మంగళసూత్రాలను కూడా లాగివేసుకుంటుందని మోడీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ తేజస్వి యాదవ్‌పై విధంగా స్పందించారు. పాట్నాలో విలేకరులతో తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ.. ‘కోవిడ్‌ మహమ్మారి సమయంలోనూ, నోట్ల రద్దు తరు వాత, పుల్వామా ఉగ్రదాడి, సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా అనేక మంది మహిళల మంగళసూత్రాలు తెగి పడ్డాయి. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారో ప్రధానమంత్రి మాకు చెప్పాలి’ అని అన్నారు. ‘ఎన్నికలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉండాలి. అధిక ధరలతో బంగారం మహిళలు కొనలేని విధంగా మారినప్పుడు ‘మంగళసూత్రం’ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు’ అని కూడా యాదవ్‌ అన్నారు. బీహార్‌లో రెండో దశ ఎన్నికలు జరుగుతున్న మొత్తం ఐదు స్థానాలను ఆర్జేడీ, దాని మిత్ర పక్షాలు గెలుచుకుంటాయని తేజస్వి యాదవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా వేదిక మధ్యే జరుగుతున్నాయని అన్నారు. ‘ఒక వైపు రాజ్యాంగానికి ముప్పు తెచ్చే ఎన్డీఏ, మరోవైపు రాజ్యాంగాన్ని రక్షించాలని అనుకుం టున్న ఇండియా వేదిక. మీరు ఇండియాను లేదా ఎన్డీఏను ఒక్కదాన్నే ఎన్నుకోవాలి’ అని తెలిపారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో పూర్నియా స్థానం నుంచి ఇండిపెండెం ట్‌గా పోటీ చేస్తున్న రాజేష్‌ రంజన్‌ అలియాస్‌ పప్పు యాదవ్‌ ను బీజేపీ బీ-టీమ్‌గా తేజస్వి యాదవ్‌ విమర్శించారు.

]]>
శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ మ్యానిఫెస్టో విడుదల https://navatelangana.com/sharad-pawar-led-ncp-manifesto-released/ Thu, 25 Apr 2024 23:02:32 +0000 https://navatelangana.com/?p=277442 ముంబయి: శరద్‌ పవార్‌ నేతత్వంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘శపత్‌నామా’ పేరుతో గురువారం ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ విడుదల చేశారు. మ్యానిఫెస్టోలో మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. మహిళల భద్రత కోసం వారికి సంబంధించిన సైబర్‌ చట్టాలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తామని, కులగణన చేపడతామని, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అప్రెంటీస్‌షిప్‌ హక్కు, ఉద్యోగాలలో మహిళలకు 50 రిజర్వేషన్‌ కల్పిస్తామని పేర్కొంది. జమ్ముకాశ్మీర్‌కి పూర్తి రాష్ట్ర హౌదాకు మద్దతు ఇస్తామని, ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణను చేస్తామని, ప్రభుత్వ రంగాలలో కాంట్రాక్ట్‌ కార్మికులను నిషేధిస్తామని, కార్మికుల ప్రయోజనాలను చట్టబద్ధంగా పరిరక్షిస్తామని పేర్కొంది. పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సీ), యూఏపీఏ చట్టాలను సమీక్షించి మార్పులను ప్రతిపాదిస్తామని పేర్కొంది. ఇతర చట్టాలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమైనవని తెలిపింది. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు అధికారం కల్పించడం, విద్యుత్‌ పంపిణీని సమీక్షించడం, రాజ్యాంగ సవరణలను అమలు చేస్తామని తెలిపింది.

]]>
కన్నౌజ్‌ నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు https://navatelangana.com/akhilesh-yadav-filed-nomination-from-kannauj/ Thu, 25 Apr 2024 23:01:39 +0000 https://navatelangana.com/?p=277445

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ గురువారం యూపీలోని కన్నౌజ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి ఎంతో పట్టున్న కన్నౌజ్‌ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు విజయం సాధించారు. 2012, 2014 ఎన్నికల్లో ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌ గెలిచారు. 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పాథక్‌ చేతిలో ఆమె ఓటమిని చవిచూశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు అనంతరం అఖిలేశ్‌ మాట్లాడుతూ ఎస్పీ చేపట్టిన అభివద్ధిని బీజేపీ ఉద్దేశపూర్వకంగా నిలువరి స్తోందని ఆరోపించారు. అంతేకాకుండా నెగెటివ్‌ రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజలను పదేపదే అవమానిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కన్నౌజ్‌ ప్రజలకు సేవలందించేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఎస్పీ హయాంలో కన్నౌజ్‌లో జరిగిన అభివద్ధి ప్రజలకు తెలుసునని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ నియోజకవర్గం నుంచి అఖిలేశ్‌ మేనల్లుడు, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అల్లుడైన మాజీ ఎంపీ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పోటీ చేస్తారని పార్టీ వర్గాలే ప్రకటించాయి. ఇక పార్టీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేశ్‌ పోటీలో ఉండాలని నిర్ణయించారు.

]]>
దేశంలో మోడీ వ్యతిరేక గాలి వీస్తోంది https://navatelangana.com/an-anti-modi-wind-is-blowing-in-the-country/ Thu, 25 Apr 2024 22:58:17 +0000 https://navatelangana.com/?p=277441 – మోడీ పాలనలో కనబడని ఎమర్జెన్సీ
– స్వతంత్ర సంస్థల్ని నిర్వీర్యం చేసిన వైనం
– ఆర్‌ఎస్‌ఎస్‌ది స్వాతంత్య్ర పోరాటంలో లొంగిపోయిన పాత్ర
– ప్రజల పక్షాన గొంతు విప్పిన ప్రబీర్‌ పుర్కాయస్థ
– ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకావిష్కరణ సభలో..ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్‌.వినయ కుమార్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘దేశంలో మోడీ వ్యతిరేక గాలి వీస్తోంది కనబడని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఆనాటి ఎమర్జెన్సీ కూడా ఇంత దారుణంగా లేదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులది లొంగిపోయిన పాత్ర తప్ప ఏ చరిత్రా లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈడీ, విజిలెన్స్‌, ఎన్నికల సంఘం వంటి సంస్థల్ని నిర్వీర్యం చేసింది. తమకు నచ్చిన వాళ్లతో ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే కాకుండా ప్రగతిశీల భావజాలం సైతం ప్రమాదంలోకి నెట్టబడుతుంది’ అని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ అన్నారు.
గురువారం సంగారెడ్డి పట్టణంలో నవతెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రబీర్‌ పుర్కాయస్థ రచించిన ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకావిష్కరణ సభ నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధి మేకల కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాలకు దేశ స్వాతంత్య్ర పోరాటంలో లొంగిపోయి క్షమాపణ కోరిన పాత్ర తప్ప.. పోరాడిన చరిత్ర లేదన్నారు. సావర్కర్‌ ఆదేశాల మేరకే మహాత్మాగాంధీని గాడ్సే హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గోద్రా అల్లర్లు సృష్టించి మారణహోమానికి పాల్పడిన ఫలితంగానే మోడీ సీఎం అయ్యారని, 2013లో ముజఫర్‌లో మత ఘర్షణలు సృష్టించి ఆధిత్యనాథ్‌ యోగి సీఎం అయ్యాడన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందిన సంఘటనల్లోని వాస్తవాల్ని వెలుగుతీసి న్యూస్‌క్లిక్‌ డిజిటల్‌ చానల్‌ ద్వారా ప్రజల పక్షాన నిలిచిన ప్రబీర్‌ పుర్కాయస్థను కుట్రపూరితంగా అరెస్టు చేశారని తెలిపారు.
ఆనాటి ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద పుర్కాయస్థను జైళ్లో పెట్టారని, ప్రస్తుతం మోడీ పాలనలో కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీలో కూడా ఉపా చట్టం కింద 2021లో అరెస్టు చేసిన.. బీజేపీ ప్రభుత్వం కక్షకట్టి నిర్బంధంలోకి నెట్టిందన్నారు. అప్పటి ఎమర్జెన్సీ ప్రకటితమైందని, మీడియాలో రాసే రాతలపై ఆంక్షలుండేవని గుర్తు చేశారు
. మోడీ పాలనలో కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీలో మాత్రం మీడియా సంస్థల్ని మోడీ తన చెప్పుచేతుల్లో పెట్టుకున్నారన్నారు. మోడీ పాలనలోని డొల్లతనాన్ని ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ఏమీ రాయలేకపోతున్నాయన్నారు. సోషల్‌ మీడియా మాత్రం మోడీ పాలనలోని డొల్ల చేష్టల్ని ఎత్తిచూపుతున్నాయన్నారు. డిజిటల్‌ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సహించే పరిస్థితిలేదన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ముస్లీంలు హిందూ మహిళల పుస్తెలతాళ్లను ఉంచరని మోడీ చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు. లౌకిక శక్తులు అప్రకమత్తంగా ఉండి సోషల్‌ మీడియాలో వస్తున్న మోడీ త్రయం తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, ప్రముఖ వైద్యులు కృష్ణమూర్తి, సీనియర్‌ జర్నలిస్టు పీవీరావు, నవతెలంగాణ బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.వాసు, రచయిత వినోద్‌కుమార్‌, సింగర్‌ కిషన్‌, రైతు సంఘం రాష్ట్ర నాయకులు జి.జయరాజ్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం, నవతెలంగాణ జీఎం నరేందర్‌, మెదక్‌ రీజియన్‌ మేనేజర్‌ రేవంత్‌కుమార్‌, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

]]>
మందులు అమ్ముకొని బతికిన చరిత్ర నీది https://navatelangana.com/you-have-a-history-of-selling-medicines-and-surviving/ Thu, 25 Apr 2024 22:56:39 +0000 https://navatelangana.com/?p=277440 – మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి : గుత్తా ముఖ్య అనుచరుల వ్యాఖ్యలు
నవతెలంగాణ-నల్లగొండటౌన్‌
”సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిజ్ఞానం కలిగిన మచ్చలేని మహా నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి.. మందులు అమ్ముకొని బతికిన నీచ చరిత్ర నీది.. గుత్తా గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది..? ఉస్మానియా యూనివర్సిటీలో వేలాది మంది చేసిన ఉద్యమాలను నీవే చేసినట్టు నీ ఖాతాలో వేసుకొని, వెంట నడిచిన స్నేహితులను సైతం నిలువునా ముంచింది ఎవరికి తెలియదు.. అధికారులను వేధించి.. దళిత బంధులో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డావ్‌.. ఇవన్నీ నిజం కాదా..?” అని గుత్తా ముఖ్య అనుచరులు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గుత్తా సుఖేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తాను విమర్శించే స్థాయిగాని, వయస్సు లేని చిల్లర వ్యక్తి గాదరి కిషోర్‌ అని అన్నారు. ప్రజలకు తన నీచ చరిత్ర తెలుసు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి తరిమికొట్టారని అన్నారు. ఇసుకదందాను వృత్తిగా మార్చుకుని వందల కోట్ల రూపాయలు సంపాదించిన ప్రబుద్ధుడని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి చందాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పతనానికి ప్రధాన కారుకుడు కిషోర్‌ అని విమర్శించారు. తిరుమలగిరి మండలంలో దళితబంధు పథకంలో తన బినామీలకు, అనుచరులకు ఇప్పించి కోట్ల అవినీతికి పాల్పడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తనకు అనుకూలమైన కలెక్టర్‌ను రంగారెడ్డి జిల్లాలో పెట్టుకొని కుంట్లూరు గ్రామ శివారులో భూ అక్రమ దందా చేసిన విషయం ఒక పత్రికలో ప్రచురించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని బినామి రైస్‌ మిల్లులకు పంపింది నిజం కాదా అన్నారు. మరోసారి గుత్తా సుఖేందర్‌ లాంటి వ్యక్తి మీద ఒక్కమాట మాట్లాడినా నాలుక కోసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మెన్‌ ఇరిగి పెద్దులు, కనగల్‌ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఐతగోని స్వామిగౌడ్‌, వెంకటేశ్వర్‌రావు, గోపాల్‌రెడ్డి, యామా దయాకర్‌, హరికృష్ణ, మునాసు వెంకన్న, మాజీ జెడ్పీటీసీ సంజీవ, చిల్కరాజు శ్రీనివాస్‌, బకారం వెంకన్న, పీఏసీఎస్‌ చైర్మెన్‌ దోటి శ్రీనివాస్‌, చెన్నగోని యాదగిరి, మైనారిటీ నాయకులు అనీష్‌ ముక్తాదర్‌, హన్ను ఉన్నారు.

]]>