ఒకేరోజు 68 కేసులు నమోదు…రూ.1.47 లక్షల జరిమానాలు వసూలు
తనిఖీల్లో బయటపడుతున్న ప్రయివేటు బస్సుల ఉల్లంఘనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రవాణాశాఖ నిబంధనలు పాటించని ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. తనిఖీల్లో ట్రావెల్ బస్సుల్లోని లోపాలు బట్టబయలు అవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినట్టు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్త్రుత తనిఖీలు చేపట్టారు. విజయవాడ, బెంగుళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ బృందాలు బస్సుల తనిఖీ చేపట్టాయి. మూడు జిల్లాల పరిధిలో 8 బృందాలతో తనిఖీ చేస్తున్నారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు (మొదటిపేజీ తరువాయి) పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుస్తున్న కొన్ని ప్రయివేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేశారు. కర్నూలు నుంచి వచ్చే బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. బీమా, ఫిట్‌నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్, చింతలకుంట వద్ద నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేశారు. ఒక్కరోజే ప్రయివేటు బస్సులపై 68 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో 6, వెస్ట్ జోన్ పరిధిలో 9, సౌత్ జోన్ పరిధిలో 9, నార్త్ జోన్ పరిధిలో 23, రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 7 బస్సులపై కేసులు నమోదు చేశామని రవాణాశాఖ అధికారులు తెలిపారు. తనిఖీల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని రవాణాశాఖ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేస్తున్నామనీ, లేని వాటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. శనివారం జరిపిన తనిఖీల్లో ప్రయివేటు బస్సుల నుంచి రూ.1 లక్ష 17వేల జరిమానా విధించి వసూలు చేశామన్నారు. మంటలు ఆర్పే యంత్రాలు, ప్రాథమిక చికిత్స బాక్సులు లేని బస్సులపై కూడా కేసులు నమోదు చేశారు. అలాగే బస్సుల్లో అక్రమంగా సెల్‌ఫోన్లు, మోటార్ సైకిళ్లు కూడా తరలిస్తున్నట్టు ఈ తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి చర్యలు చట్ట నిబంధనలకు విరుద్దమని అధికారులు తెలిపారు. బస్సుల్లో కన్వర్జేషన్, ఆల్ట్రేషన్, సీట్ల సంఖ్య పెంపు, స్లీపర్లుగా మార్చేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు. అయితే ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో అనేక బస్సులు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఆ మేరకు అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.
ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



