Monday, November 3, 2025
E-PAPER
Homeక్రైమ్ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢీ.. 10 ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢీ.. 10 ప్రయాణికులకు తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ లారీ ఢీకొన్నాయి. దీంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రమాదం వల్ల చేవెళ్ల, వికారాబాద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -