– ప్రమాదంలో యువతి మృతి
నవతెలంగాణ-రామచంద్రాపురం
స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా.. యువతి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని డైమండ్ పాయింట్ ఎదురుగా ఉన్న సాయి కాలనీ రోడ్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రామచంద్రాపురంలోని బాంబే కాలనీకి చెందిన ఉమామహేశ్వరి( 28) బీరంగూడలోని మజిల్ టాక్ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేస్తుంది. కాగా విధులకు వెళ్లేందుకు స్కూటీపై బయలుదేరింది. ఈ క్రమంలో రామచంద్రాపురంలోని డైమండ్ పాయింట్ ఎదురుగా సాయి కాలనీ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు ఆమె వెళ్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. దాంతో యువతికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



