- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
- Advertisement -