విద్యార్థుల రాస్తారోకో..
నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని గన్ పూర్, ఇస్లాంపూర్ గ్రామాల విద్యార్థులకు డిచ్ పల్లి మోడల్ స్కూల్ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం టియుసిఐ, పిడిఎఫ్ యూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా నాయకులు బి.మురళి మాట్లాడుతూ డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనపూర్ ఇస్లాంపూర్ నుండి సుమారు 60 మంది విద్యార్థులు డిచ్ పల్లి మోడల్ స్కూల్ లో చదువుకుంటున్నారు. వారికి ఆర్టీసీ బస్సు డిచ్ పల్లి మీదుగా మోడల్ స్కూల్ వరకు నడుస్తున్నదని, కానీ అన్ని గ్రామాలు మీదుగా ప్రయాణించి వచ్చేసరికి ప్రతిరోజు గంట ఆలస్యంగా విద్యార్థులు స్కూలుకు చేరుతున్నారని తద్వారా ప్రతిరోజు ఒక పీరియడ్ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్ల ఘన్ పూర్, ఇస్లాంపూర్ గ్రామాల నుండి మోడల్ స్కూల్ వరకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు. అలా వీలుకాని ఎడల కనీసం మల్లాపూర్, రాంపూర్ నుండి వచ్చే బస్సును పాఠశాల సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ నాయకులు కార్తీక్, బబ్లు, కీర్తన, అవంతిక, ఆదిశ్రీ, తేజు, మురళీధర్, నవతేజ, టియుసిఐ నాయకులు రాములు, అశోక్, ప్రవీణ్, రమేష్, ప్రేమ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.