నవతెలంగాణ- పరకాల : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కొత్త ఉద్యోగాల ప్రకటనలకు గత ఏడాది నుంచి నిరుద్యోగులను ఊరిస్తువచ్చింది. అయితే ఇటీవల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ.తాజాగా కండక్టర్ల పోస్టులను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు చేసింది,ఇందుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు రాష్ట్రంలోని నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుతోపాటు పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అని ఆర్టీసీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపారు,ఇందుకుగాను గత కొన్ని రోజుల క్రితం కండక్టర్ పోస్టులను ఏజెంట్స్ కి ఇవ్వడం వలన డబ్బులు,పలుకుబడి,రాజకీయ ఫైరోలు చేసిన వారికి ఉద్యోగం ఇస్తున్నారు, గత 12 సంవత్సరాల నుండి నిరుద్యోగులుగా ఉద్యోగాలు రాక పెద్ద పెద్ద చదువులు చదివి వివిధ రకాల పనులు చేస్తున్నారు కాగా ఈ కండక్టర్ పోస్టులలో నిరుద్యోగులకు రాత పరీక్షలు నిర్వహించి ఉత్తర్నులై అర్హులైన నిరుద్యోగులకు యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలని వరంగల్ ఎంపీ కంటెస్టెంట్ బొచ్చు రాజు స్వేరో స్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కి కండక్టర్ పోస్టుల్లో ఏజెన్సీ కి కాంట్రాక్టు ఇవ్వద్దని వినతి పత్రాన్ని అందజేశారు, ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ
కండక్టర్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ లో రిజర్వేషన్ పరంగా ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే స్త్రీలు పురుషులు ఎంతమందిని నియమిస్తారనేది తెలియజేయాలని,డిమాండ్ చేశారు ఆర్టీసీ యాజమాన్యం కొద్ది నెలల క్రితమే నోటిఫికేషన్ను జారీ చేసిన వరంగల్, కరీంనగర్, ఖమ్మం రీజియన్లలో అన్ని డిపోల్లో ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్, డ్రైవర్ల పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. ఎంపికైన వారికి రూ.18,000 జీతం ఉంటుందని ఇప్పటికే అధికారులు తెలిపారు. అయితే దీనిని స్వేరోస్ నెట్వర్క్ తీవ్రంగా వ్యతిరేస్తుంది, వినతి పత్రం ఇచ్చిన వారిలో కొడపాక సనత్, మంద మనోజ్, సీపతి తిరుపతి, రాజా వేణు తదితరులు పాల్గొన్నారు.