నవతెలంగాణ – అమరావతి: బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈక్రమంలో తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డులోకి రాగానే డ్రైవర్ రసూల్(50)కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన స్టీరింగ్‌పై కుప్పకూలారు. బస్సు రోడ్డు పక్కకు వెళ్లి ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమై డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే ఆయన చనిపోయాడు. సంఘటనా స్థలాన్ని ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బస్సు నడుపుతూ.. గుండెపోటుతో స్టీరింగ్ పైనే కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES