నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి మంగళవారం బస్‌భవన్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పూర్వ ఎమ్‌డీ వీసీ సజ్జనార్ ఆయన్ని అభినందించారు. అనంతరం నిజాం కాలంనాటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మంగళవారం ఈ బస్సును కొత్త ఎమ్‌డీకి చూపేందుకు బస్‌భవన్‌కు తీసుకొచ్చారు. బస్సును చూసి ముచ్చటపడిన ఎమ్‌డీ నాగిరెడ్డి అదే బస్సులో బస్‌భవన్‌లో చక్కర్లు కొట్టారు. 1932లో నిజాం స్టేట్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్-నాందేడ్ మధ్య రెండు బస్సులు తిరిగేవి. వీటిలో ఒక బస్సును విజయవాడ బస్టాండ్‌లో పెట్టారు. మరో బస్‌ను ముషీరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఏర్పాటు చేశారు.
నిజాం బస్సులో ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES