Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా ప్రయాణికులను సన్మానించిన ఆర్టీసీ అధికారులు 

మహిళా ప్రయాణికులను సన్మానించిన ఆర్టీసీ అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
హనుమకొండ జిల్లా పరకాల ఆర్టీసీ అధికారులు మహిళా ప్రయాణికులను శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టిన నుండి బుధవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ద్వారా ప్రయాణించడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీకి 6 వేల 7 వందల కోట్ల ఆదాయం సమకూరినట్లు  ఆర్టీసీ ఎండీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా పరకాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరకాల డిపో పరిధిలో ఐదుగురు మహిళలను పరకాల మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -