Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ తొలి ఉమెన్‌ డ్రైవర్‌ సరిత ఎంతోమందికి ఆదర్శం

ఆర్టీసీ తొలి ఉమెన్‌ డ్రైవర్‌ సరిత ఎంతోమందికి ఆదర్శం

- Advertisement -

– మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా చేరిన సరిత దేశంలోని ఎంతో మంది మహిళలకు ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొనియాడారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని డ్రైవర్‌ సరిత కలిశారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి కొండా సురేఖ ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సరిత తన కుటుంబ సమస్యలను మంత్రికి నివేదించగా…ఇక నుంచి ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని కొండా సురేఖ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -