- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ ఎన్నికైన చంద్రగిరి సంపత్, ఉప సర్పంచ్ గా ఎన్నికైన బడితేల కుమారస్వామి, వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్, జాడి రాజశేఖర్, గాదె గట్టయ్య, టేకం రవళి, జాడి అనసూర్య, గాదె రమేష్, మోత్కురి సంధ్యారాణి, కొమ్మేర విజయలక్ష్మి, భాస్క అశోక్ లు సోమవారం ప్రత్యేక అధికారి, కార్యదర్శిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి బడితేల స్వరూప-రాజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, యాద గట్టయ్య, చెంద్రమొగిలి, మహేష్ పాల్గొన్నారు.
- Advertisement -



