- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రన్ ఫర్ హెల్త్–రన్ ఫర్ ఫ్యూచర్ నినాదంతో 5 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు తన స్నేహితుడు యశ్వంత్ జ్ఞాపకార్థం నిర్వహించినట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి, ఉప సర్పంచ్ కార్తిక్ రెడ్డి, అడ్వకేట్ దేవరాజ్, ఎస్‌ఐ–2 నరేందర్ జెండా ఊపి ప్రారంభించారు. యువతలో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఉదయ్ శర్మతో,యూత్ సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



