- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
భారత తొలి ఉప ప్రధాని,ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం మర్రిగూడ పోలీస్ వారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. మర్రిగూడ ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్,మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొడాల అల్వాల్ రెడ్డి,బిజెపి మండల అధ్యక్షులు రాజేందర్ నాయక్,పోలీస్ సిబ్బంది,ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    