- Advertisement -
– 22 పైసలు పతనం
న్యూఢిల్లీ : అమెరికా టారిఫ్ చర్చలకు తోడు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ భారీగా పతనమయ్యింది. స్టాక్ మార్కెట్ల వరుస పతనం.. ఎఫ్‌ఐఐలు తరలిపోవడంతో రోజు రోజుకు ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 22 పైసలు క్షీణించి 86.02కు దిగజారింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 85.96 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఏకంగా 86.05కి పడిపోయింది. తుదకు 22 పైసలు కోల్పోయి 86.02 వద్ద ముగిసింది. ముడి చమురు బ్యారెల్ ధర 1.56 శాతం పెరిగి 71.46 వద్ద ముగిసింది.
- Advertisement -