హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది.
ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 
దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ‘ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిచ్చే చిత్రంగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. విజయ్, కీర్తి పాత్రలు అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తాయి’ అని చిత్ర యూనిట్ తెలిపింది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రవీణ్ రాజా, ప్రొడక్షన్ డిజైనర్ – డినో శంకర్, డీవోపీ – అనంద్ సి.చంద్రన్, నిర్మాతలు – దిల్ రాజు, శిరీష్.
గ్రామీణ నేపథ్య యాక్షన్ కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

