ఉత్సాహంగా, ఉల్లాసంగా విద్యార్థుల ఆటలు
నవతెలంగాణ – రామారెడ్డి
ప్రాచీన ఆటలు కాపాడుతూ, విద్యార్థుల దారుడ్యానికి , ఉల్లాసానికి ఉపయోగపడే గ్రామీణ ఆటలకు నిలయంగా ఉప్పల్వాయి గురుకుల పాఠశాల నిలిచింది. పాఠశాల క్రీడాకారులు 11వ జోనల్ స్థాయి గవర్నమెంట్ లో ఛాంపియన్గా నిలవడం, పాఠశాలలో విద్యార్థుల మానసిక ఉల్లాసo కోసం కబడ్డీ, ఖో ఖో తోపాటు గూటీలు, దాగుడుమూతలు వంటి ఆటలు ఆడుతూ విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతున్నామని అన్నారు. ప్రిన్సిపాల్ శివరాం మాట్లాడుతూ.. విద్యార్థులు నేటి రోజుల్లో సెల్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. దీన్ని అధిగమించడానికి ప్రతిరోజు ఆడే ఆటలతో పాటు గతంలో మనం ఆడిన గ్రామీణ ఆటలైన గోటీలు, దాగుడుమూతలు లాంటి ఆటలను విద్యార్థులకు ఆడిస్తూ మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తున్నాము. వారి మానసిక ఉల్లాసం చదువులో ప్రతిభ చూపడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
శరీర దారుఢ్యానికి గురుకులంలో గ్రామీణ ఆటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



