నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా బలగాలు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఈ ఘటనపై రష్యా ఎంపీ అలెక్సీ జురావ్లెవ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా తీరు ఇలాగే కొనసాగితే, వారి కోస్ట్ గార్డ్ పడవలను టార్పిడోలతో ముంచివేయాల్సి వస్తుందని రష్యా చట్టసభ సభ్యుడు ఒకరు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
“ఏం చేసినా శిక్ష పడదన్న ధీమాతో అమెరికా ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే సైనిక దాడులకు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను ముంచేయాల్సి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు. ఈ చర్యను ‘సముద్రపు దోపిడీ’ అని రష్యా అధికారులు అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘించడమేనని రష్యా రవాణా శాఖ ఖండించింది.



