Monday, March 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం250 ఉక్రెయిన్‌ డ్రోన్‌లను కూల్చివేసిన రష్యా వైమానిక దళాలు

250 ఉక్రెయిన్‌ డ్రోన్‌లను కూల్చివేసిన రష్యా వైమానిక దళాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన 250 ఉక్రెయిన్‌ డ్రోన్‌లను వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయని రష్యా సోమవారం తెలిపింది. వారాంతంలో మాస్కోపై ప్రయోగించిన 250 డ్రోన్‌లను వైమానిక దళాలు కూల్చివేశాయని మాస్కో మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ పేర్కొన్నారు. సోమవారం కొన్ని ప్రధాన విమానాశ్రయాలు కార్యకలాపాలను రద్దు చేయడంతో మేయర్‌ ఈ ప్రకటన విడుదల చేశారు.

మాస్కోను సమీపిస్తున్న మొత్తం 159 డ్రోన్‌లను భద్రతాదళాలు కూల్చివేశాయని అన్నారు. ‘రక్షణశాఖలోని వైమానిక విభాగం వృత్తిపరమైన విధికి మరియు అంకితభావానికి ధన్యవాదాలు’ అని మేయర్‌ ఒకపోస్ట్‌లో తెలిపారు.వైమానిక భద్రత దృష్ట్యా రాజధానిలోని డొమోడెడెవో మరియు జుకోవ్స్కీ విమానాశ్రయాలు కార్యకలాపాలను పరిమితం చేశాయని స్థానికమీడియా తెలిపింది. ప్రయాణికులు విమానాల షెడ్యూల్స్‌ను తనిఖీ చేసుకోవాలని సూచించింది. మరో విమానాశ్రయం వ్నుకోవో కూడా కార్యకలాపాలను రద్దు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -