నవతెలంగాణ-హైదరాబాద్ : ఎస్.ఆర్.శంకరన్ ఐఏఎస్ అకాడమీలో మహాత్మ సావిత్రిబాయి పూలే 195వ జయంతి అలాగే అకాడమీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహాత్మ సావిత్రిబాయి పూలే తాత్విక భావనలు అన్న అంశం పైన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్. ఆర్. శంకరన్ ఐఏఎస్ అకాడమీ ప్రిన్సిపల్ కే. సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరుగగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే సతీష్ కుమార్ ఆహ్వానం పలికారు.
అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ తాత్వికత అంటే సమాజంలో ప్రశ్నించేటువంటి తత్వాన్ని ప్రోత్సహించడం అని, ప్రశ్నించినప్పుడే జ్ఞానం వస్తుందని అలాంటి అంశాల్ని సావిత్రిబాయి పూలే, మహాత్మ జ్యోతిబాపూలే ఇద్దరు కలిసి ఈ సమాజానికి ఒక సందేశాన్ని అందించారని కొనియాడారు. పూలే దంపతులు వారి సహచర్యంతో సమాజంలో వస్తున్న దురాచారాల పైన పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారు. దాంతోపాటు ఈ వ్యవస్థ మార్పు జరగాలంటే కచ్చితంగా విద్య అవసరమని దానికి స్త్రీ విద్య అవసరం అనేటువంటి దాన్ని ఎక్కువగా భావించి మహాత్మ పూలే తన భార్యని టీచరుగా తీర్చిదిద్దినటువంటి సంగతిని మనం మర్చిపోరాదని వక్తలు గుర్తు చేశారు. సావిత్రిబాయి పూలే సర్టిఫైడ్ టీచర్ అయిన తర్వాత మహారాష్ట్రతో పాటు మొత్తం భారతదేశం అంతా కూడా మహిళా అభ్యున్నతి కోసం కృషి చేశారని మహిళా విద్య కోసం కృషి చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో .వై .సత్యనారాయణ ఎక్స్ ఐ ఓ ఎఫ్ ఎస్, అడిషనల్ కమిషనర్. కమర్షియల్ టాక్సెస్ రిటైర్డ్.టీ. స్కైలాబ్ బాబు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. ఎస్.ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే.సతీష్ కుమార్, ఆన్లైన్ కోర్స్ ఎడిటర్ కోట మురళీకృష్ణ, కార్యాలయ సిబ్బంది గాజర్ల రమ, సుమన్ దలోడ్ ,బి.సంధ్యారాణి అలివేలమ్మ ,బి.రంజిత్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రముఖ విద్యవేత్త శ్రీ చుక్క రామయ్య చేతులమీదుగా పుస్తకావిష్కరణ

వై సత్యనారాయణ రచించిన ఆంగ్లం మూలం పుస్తకాన్ని చుక్కా రామయ్య ఆవిష్కరించారు. మొదటి కాపీని వై.సత్యనారాయణ చుక్కా రామయ్యకు అందజేశారు. చుక్కారామయ్య ఐఐటి రామయ్యగా భారతదేశంలోనే పేరు పొందిన గొప్ప టీచర్ గా వారు 15 సంవత్సరాల క్రితం మార్కుల వ్యూహం అనే పుస్తకాన్ని ఆవిష్కరించగా ఆ పుస్తకం యొక్క ఆంగ్ల మూలాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై. సత్యనారాయణ, చొప్పరి బాలకృష్ణ ,కె.సతీష్ కుమార్ పాల్గొన్నారు.





