Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్‌.రామ్మోహన్‌రావు, వంగూరు రాములు

తెలంగాణ బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్‌.రామ్మోహన్‌రావు, వంగూరు రాములు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (బీసీడబ్ల్యూఎఫ్‌ -సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులుగా ఎస్‌.రామ్మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శిగా వంగూరు రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 75 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఏర్పడగా అందులో నుంచి 25 మంది ఆఫీస్‌ బేరర్లుగా ఉండనున్నారు. రాష్ట్ర కమిటీలోకి 11 మంది మహిళలను తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్‌.రామ్మోహన్‌రావు, వంగూరు రాములు ఒక ప్రకటన విడుదల చేశారు.

కార్యనిర్వాహక అధ్యక్షులుగా ముదాం శ్రీను, కోశాధికారిగా ఎ. రాజు, ఉపాధ్యక్షులుగా డి.లక్ష్మయ్య (ఖమ్మం), బి. శ్రీనివాసులు (నాగర్‌ కర్నూల్‌), వర్ధ గాలయ్య (మహబూబ్‌నగర్‌), టి. ఉప్పలయ్య (హన్మకొండ), శ్రీశైలం (మహ బూబాబాద్‌), కె.జంగయ్య (హైదరాబాద్‌ సౌత్‌), ఎల్క సోమన్న (సూర్యాపేట), జి. సోములు (యాదాద్రి భువనగిరి), వేల్పుల జ్యోతి (నల్లగొండ), రాధ (హన్మ కొండ), పెంటయ్య (సంగారెడ్డి). కార్యదర్శులుగా సీహెచ్‌. లక్ష్మినారాయణ (నల్ల గొండ), జె. వెంకన్న (మేడ్చల్‌), ఆరూరి కుమార్‌ (వరంగల్‌), కొత్తపల్లి శివకృష్ణ (సూర్యాపేట), కోట సంధ్యారాణి (యాదాద్రి భువనగిరి), పార్వతి (రంగారెడ్డి), సీహెచ్‌.రవి (సిద్ధిపేట). రాష్ట్ర మహిళా సబ్‌ కమిటీ కన్వీనర్‌గా సంధ్యా రాణి, కో-కన్వీనర్‌గా పార్వతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించామని తెలిపారు.

వెల్ఫేర్‌బోర్డు పథకాలను ఇన్సూ రెన్స్‌ కంపెనీలకు అప్పగించే జీవో 12ను సవరించి బోర్డు ద్వారానే అందించా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ ఇసుక బజారు మోసాన్ని అరికట్టాలనీ, ఏపీలో మాదిరిగా ఉచితంగా ఇవ్వాలని కోరారు. లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనీ, 1996 కేంద్ర చట్టం, 1998 సెస్సు చట్టం, 1979 వలస కార్మికుల చట్టాలను రక్షించాలని డిమాండ్‌ చేశారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని,పని ప్రదేశాల్లో మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు రూ.346 కోట్లు, సీఎస్‌సీ హెల్త్‌ సంస్థకు రూ.500 కోట్లకుపైగా అక్రమంగా ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిబంధనలను పాటించని కార్మిక శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలనీ, వెల్ఫేర్‌ బోర్డు నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల పాటు జరిగిన మహాసభల్లో సీడబ్ల్యూఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ ఎస్వీ.రమ, ట్రాన్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పి. శ్రీకాంత్‌, 300 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -