రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రోడ్డు ట్రాఫిక్ రైలు కార్యకలాపాలలో భద్రత కోసం అన్ని లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద భద్రతా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్యరైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సూచించారు. సోమవారం రైల్ నిలయంలో భద్రత, ట్రాఫిక్ సౌకర్యాల పనులపై వివరణాత్మక సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ , వివిధ శాఖలకు చెందిన విభాగాధి పతులతో పాటు మొత్తం సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీ.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతను నొక్కి చెబుతూ, రోడ్డు ట్రాఫిక్ సురక్షితంగా ప్రయాణిం చడానికి రైలు కార్యకలాపాలలో ఇంటర్లాకింగ్ లేని అన్ని గేట్ల వద్ద భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం చాలా అవసరమని పేర్కొన్నారు.
జోన్‌లో నాస్‌ఇంటర్లాకింగ్ గేట్ల స్థానం గురించి అధికారులు జనరల్ మేనేజర్‌కు అధికారులు వివరించారు. నాన్‌ఇంట ర్లాకింగ్ గేట్లను ఇంటర్లాకింగ్ లెవల్ క్రాసింగ్ గేట్లుగా మార్చడంపై కార్యాచరణ ప్రణాళికను జనరల్ మేనేజర్ సమీక్షించారు. రోడ్డు, రైలు వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడా నికి ఆర్‌యూ బీలు, ఆర్‌వోబీల వద్ద కొనసాగుతున్న పనులను వేగవంతం చేయాలని ఆదేశిం చారు. అలాగే శీతాకాలంపై సమీక్షించారు. అందుకు సంబందించి తగినన్నీ పొగమంచు పరికరాలు, విద్యుత్, సిగల్ పరికరాలు, ట్రాక్ ఇరు ప్రక్కల అడ్డుగా ఉన్న చెట్ల నరికివేతపై అధికారులతో మాట్లాడారు. రైళ్ల ఆక్రమిత లైన్లకు వ్యతిరేకంగా సిట్ చేయబడిన పాయింటును గుర్తించడానికి స్టేషన్లలో భద్రతా అలారాలను ఏర్పాటు చేయడం పై కూడా ఆయన చర్చించారు. రైళ్ల సమయపాలన కొనసాగించడానికి కేబుల్ డామేజ్లను గుర్తించి వాటిని వెంటనే సరిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
లెవెల్ క్రాసింగ్ వద్ద భద్రత నిర్వహణ కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



