తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి చెబుతూ… ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అంటాడు కృష్ణదేవరాయలు. ఇంగ్లీష్ చదువులొచ్చాక తెలుగ భాష క్రమంగా మసకబారిపోయింది. అమ్మ భాష కాస్త పరాయిభాషగా మారిపోయింది. దాన్ని బతికించుకునేందుకు సాహితీ ప్రియులు, భాషాభిమానులు అక్షర యజ్ఞం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ తీసుకున్న నిర్ణయం ప్రాంతీయ భాషల ఉనికికి ప్రమాదకరంగా మారింది. ఒక్క తెలుగనే కాదు.. కన్నడం, తమిళం, మలయాళంతో పాటు మరాఠీపై కాషాయ సర్కార్ సాంస్కృతిక దాడిని ప్రారంభించింది. రాజ భాష పేరుతో బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నాలకు దక్షిణాదిలోని విపక్షాలతో పాటు స్వపక్షం నుంచి ప్రతిఘటన ప్రారంభమైంది. పిల్లిని చీకటి గదిలో బందిస్తే.. ఎదురు దాడి చేస్తుందనేది నానుడి. మోడీ సర్కార్ తీసుకున్న ఈ చర్యతో మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అచ్చంగా అలాగే తయారైంది. హిందీని బలవంతగా రుద్దే ప్రయత్నం అక్కడి మరాఠా సోదరుల మధ్య సఖ్యతకు, రాజకీయ పునరేకీకరణకు దారి తీసింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గుడ్డిలో మెల్లగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. హిందీని బలవంతంగా రుద్దబోమంటూ జీవో తెచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఏకంగా హిందీ భాష అమలుపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమయ్యారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా తీసుకునే నిర్ణయాలేవీ చరిత్రలో నిలిచిన దాఖలాలు లేవు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆ విషయాన్ని గుర్తెరిగి నడుచుకోవడం మంచిది.
– ఊరగొండ మల్లేశం
మాతృ భాషలపై కాషాయం దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES