Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకుంగిన డబుల్‌ బెడ్‌రూమ్‌ స్లాబ్‌

కుంగిన డబుల్‌ బెడ్‌రూమ్‌ స్లాబ్‌

- Advertisement -

– ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ అగ్రవాల్‌కు తప్పిన ముప్పు
నవతెలంగాణ-వేములవాడ

ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌కు తృటిలో ముప్పు తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే, కలెక్టర్‌, అధికారులు, నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ క్రమంలో వారు నిలబడిన ప్రాంతంలోనే బేస్‌మెంట్‌ కుంగిపోయింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన 144 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, తాజాగా ఆ పనులు పున్ణప్రారంభమయ్యాయి. ఈ నేపథó్యంలో అధికారులతో కలిసి పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌ బేస్‌మెంట్‌పై నిలిచి ఉండగా.. అది ఒక్కసారిగా కిందకి కుంగడం కలకలం రేపింది. వెంటనే అధికారులు అప్రమత్తమై అందరినీ అక్కడి నుంచి పక్కకు పంపించారు. ఈ ఘటనతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణ నాణ్యతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -