నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: ఆత్మహత్యలు సరైన విధానం కాదని, పోరాడి సాధించుకోవాలి.. సాయి ఈశ్వర చారి ఆత్మహత్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు చేసిన హత్య అని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈశ్వర చారి హత్యతోనైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 42 శాతం బీసీ బిల్లు ప్రవేశపెట్టాలనీ వారి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంత్ చారి ఇప్పుడు బీసీల హక్కుల సాధన కొరకు సాయి ఈశ్వర చారి గారు అమరత్వం పొందడం చాలా బాధాకరమని ఏది ఏమైనా పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఆత్మ హత్యలు చేసుకోవడం సరియైన విధానం కాదన్నారు. ఏది ఏమైనా బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శించడం చాలా దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పంతం రవి బొజ్జ కనకయ్య బుర్ర మల్లేశం సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి వేణు సోమ నాగరాజు రజని సాగరు శ్రావణపల్లి రాకేష్ గుండ్రేటి రాజు సబ్బని రాకేష్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.



