Friday, December 5, 2025
E-PAPER
Homeబీజినెస్త్వరలో సాయి పేరెంటరల్స్‌ ఐపీఓ

త్వరలో సాయి పేరెంటరల్స్‌ ఐపీఓ

- Advertisement -

సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పణ
ఎండీ అనిల్‌ కేకే వెల్లడి


నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఔషద ఉత్పత్తుల కంపెనీ సాయి పేరెంటరల్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే సెబీకి ప్రతిపాదిత పత్రాల (డీఆర్‌హెచ్‌పీ)ను అందజేసినట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ కేకే తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్‌ మాట్లాడుతూ.. సాయి పేరెంటరల్స్‌ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం ఇప్పటికే సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ అధికారులు అడిగిన పలు అంశాలకు వివరణలు ఇచ్చామన్నారు. తుది దశలో ఉందని.. త్వరలోనే తమ ఐపీఓకు అనుమతులు రావొచ్చని ఆశిస్తున్నామన్నారు. ఈ ఇష్యూలో ఫ్రెష్‌ ఈక్విటీ ద్వారా రూ.285 కోట్లు, ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.125 కోట్లు.. మొత్తంగా రూ.410 కోట్ల నిధులు సమీకరించనున్నట్టు తెలిపారు.

ఇందులో రూ.110 కోట్లను తమ నాలుగు ప్లాంట్ల ఆధునీకరణకు, ఆర్‌అండ్‌డీ కోసం రూ.26 కోట్లు వ్యయం చేయనున్నామని చెప్పారు. కొంత మొత్తాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించనున్నామని తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియంకు చెందిన నౌమెడ్‌ ఫార్మాస్యూటికల్స్‌లో 74.6 శాతం వాటాను రూ.125 కోట్లకు కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది ఆస్ట్రేలియాలోని తమ క్లయింట్ల అవసరాలను తీర్చనుందన్నారు. అక్కడ నూతన తయారీ ప్లాంట్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. దీని స్వాధీనంతో నౌమెడ్‌ ఆర్‌అండ్‌డీ సామర్థ్యాలు, పంపిణీ నెట్‌వర్క్‌, ఉత్పత్తుల విస్తృత శ్రేణి, రాబోయే తయారీ ప్రాజెక్టులు సాయి పేరెంటరల్స్‌కు అధ్వర్యంలోకి రానున్నాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -