- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో గల మద్నూర్ మండలం లోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ హుండీ లెక్కింపు ఈనెల 21న జరగనుందని ఆలయ అధికారులు ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే ఈ ఆలయ హుండీ లెక్కింపు జిల్లా దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో జరుగుతుందని వారు వెల్లడించారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలు పాల్గొనాలని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ అధికారులు తెలియజేశారు.
- Advertisement -


