నవతెలంగాణ – మద్నూర్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్లీపర్ విధుల్లో లేకపోయినప్పటికీ బినామీ పేరు పైన మూడు నెలలకు చెందిన ఆరువేల రూపాయలు డ్రా చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విలేకరులు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ పాండురంగను ప్రశ్నించగా.. డ్రా చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కళాశాల చైర్మన్ పాంచాల్ ప్రేమల ఒకరి పేరు చెప్పడం ఆ పేరుపైన జులై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలలకు చెందిన ప్రతినెల రూ.2000 చొప్పున రూ.6000 డ్రా చేయడం జరిగిందని తెలిపారు. విధుల్లో స్వీపర్ లేకపోయినప్పటికీ బినామీ పేరు పైన జీతం ఎలా డ్రా చేస్తారని ప్రశ్నించగా.. ఈ విషయాన్ని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్కు చెప్పడం జరిగిందని, డ్రా చేసిన డబ్బులు రిటన్ చేస్తామని మాట ఇచ్చారని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల అభివృద్ధి కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని నియమిస్తే బినామీ పేరుతో స్వీపర్ పేరున ఇటు ఆదర్శ కమిటీ చైర్మన్ అటు కళాశాల ప్రిన్సిపాల్ మూడు నెలల జీతం డ్రా చేయడంపై ఆశ్చర్య పోవాల్సిందే.
స్వీపర్ లేకపోయినా బినామీ పేరుతో జీతం డ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


