పెండింగ్ వేతనాలతో పాటు ఇతర సమస్యల్ని పరిష్కరించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెప్మా రిసోర్స్‌పర్సన్స్‌కు వేతనాలు పెంచాలనీ, పెండింగ్ వేతనాలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మెప్మా రిసోర్స్‌పర్సన్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ, అధ్యక్షులు జె.చంద్రకళ, ప్రధాన కార్యదర్శి డి.శ్రీరేవతి, కోశాధికారి ఎ.పద్మ డిమాండ్ చేశారు. బీసీ కులగణన సర్వే డబ్బులు చెల్లించాలనీ, ఐడీ కార్డులు, సాధారణ బీమా రూ.10 లక్షలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లో ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్‌కు మెప్మా రిసోర్స్ పర్సన్స్ యూనియన్ ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాచారం బాలమణి, జి. మంజుల, రాష్ట్ర కార్యదర్శి పుట్ట సుభద్ర, రాష్ట్ర నాయకులు వసంత, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆరు వేల మంది ఆర్‌పిలు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థలో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా వారికి నేటికీ కనీస వేతనాలు దక్కట్లేదని వాపోయారు. ఐదు నెలల పాటు జీతాలు పెండింగ్‌లో పెడితే ఆర్‌పీలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరారు. నేరుగా ఆర్‌పీల ఖాతాల్లో జీతాలు వేయాలని విన్నవించారు. అధికారుల వేధింపులు ఆపాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారికి రూ.10 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలనీ, హెల్త్, గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్ చేశారు.
మెప్మా రిసోర్స్ పర్సన్స్‌కి వేతనాలు పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES