Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రభుత్వానికి కృతజ్ఞతలు

ప్రభుత్వానికి కృతజ్ఞతలు

- Advertisement -

– తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నర్సింగ్‌ డైరెక్టరేట్‌ అనుకూలంగా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ లక్ష్మణ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్‌ డైరెక్టరేట్‌ డిమాండ్‌ సాధనకు సహకరించిన తెలంగాణ ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాస్‌ కు ధన్యవాదాలు చెప్పారు. అనేక సంవత్సరాలుగా నర్సింగ్‌ సమాజం డైరెక్టరేట్‌ను కోరుతున్నదని గుర్తుచేశారు. ఈ డిమాండ్‌ ఆమోదం పొందడం పట్ల నర్సింగ్‌ ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. నర్సింగ్‌ డైరెక్టరేట్‌ కోసం గతంలో అనేక పోరాటాలు చేసినట్టు గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వంలో తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad