నవతెలంగాణ – కర్నాటక: కర్నాటకలో జీఎస్‌టీ నోటీసులకు వ్యతిరేకంగా చిరు వ్యాపారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. బేకరీలు, షాపుల్లో టీ, కాఫీ, పాల అమ్మకాలను నిలిపివేశారు. నిరసనకు గుర్తుగా కేవలం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా మంది వ్యాపారులు యూపీఐ చెల్లింపులను నిలిపివేశారు. కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తున్నారు.
జీఎస్‌టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకుని నోటీసులు పంపిస్తున్నారంటూ వారు ఆందోళన చేపడుతున్నారు. జీఎస్‌టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే.. తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్ స్పందించింది. చిరువ్యాపారుల ప్రతినిధులతో చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంట్లోనే సీఎం సిద్ధరామయ్య భేటీ కానున్నారు.