నవతెలంగాణ -పరకాల : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గంలో సీనియర్ నాయకులు నామాని సాంబయ్యకు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నియామకం జరిగినట్లు జిల్లా అధ్యక్షులు కామగోని రాంబాబు ప్రధాన కార్యదర్శి వేమూనూరి రాంబాబులు తెలిపారు
ప్రస్తుతం నామాని సాంబయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగారం మండలం పరకాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తూన్నారు, గతంలో వీరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గంలో వివిధ హోదాలలో పనిచేసి ఉపాధ్యాయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు.
ఈ సమావేశం లో నామాని సాంబయ్య మాట్లాడుతూ నన్ను రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ గార్కి, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ గార్కి, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు డాక్టర్ ఆట సదయ్య గార్కి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఎంపికయినా సూర రమేష్ గార్కి,రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ గణపతి గార్కి రాష్ట్ర కౌన్సిలర్లు భీమానాధుని రవి, సుధాకర్ రెడ్డి, అన్ని మండలాల భాద్యులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు .
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అసోసియేట్ అధ్యక్షులుగా సాంబయ్య
- Advertisement -
- Advertisement -



