Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'సంబరాల ఏటిగట్టు'యాక్షన్‌ సీక్వెన్స్‌తో కీలక షెడ్యూల్‌

‘సంబరాల ఏటిగట్టు’యాక్షన్‌ సీక్వెన్స్‌తో కీలక షెడ్యూల్‌

- Advertisement -

హీరో సాయి దుర్గ తేజ్‌ నటిస్తున్న పాన్‌-ఇండియా మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కీలక మైన షెడ్యూల్‌ చేస్తున్నారు. రోహిత్‌ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌పై కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి రూ.125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇది సాయి దుర్గ తేజ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ కావడం విశేషం. తాజా షెడ్యూల్‌లో పీటర్‌ హెయిన్‌ ఓ అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌కి యాక్షన్‌ కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌లో పవర్‌ ఫుల్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌తో సాయి దుర్గ తేజ్‌ తలపడతారు. గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఇచ్చే వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కూడా వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని మొదట దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇండిస్టీ సమ్మె కారణంగా రిలీజ్‌ వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తారు.
‘హనుమాన్‌’ బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టులలో ఈ సినిమా ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘సంబరాల యేటి గట్టు’ పాన్‌-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాయి దుర్గ తేజ్‌, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్‌, సాయికుమార్‌, అనన్య నాగళ్ల, రవికష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రోహిత్‌, నిర్మాతలు: కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి, డీఓపీ : వెట్రి పళనిసామి,
సంగీతం: బి అజనీష్‌ లోక్‌నాథ్‌, ఎడిటర్‌: నవీన్‌ విజయ కష్ణ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: గాంధీ నడికుడికర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad