Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఆటలుసూపర్‌-4లోనూ అదే రోజు

సూపర్‌-4లోనూ అదే రోజు

- Advertisement -

ఆసియాకప్‌ మహిళల హాకీలో కొరియాపై భారత్‌ గెలుపు

హాంగ్జౌ: ఆసియాకప్‌ మహిళల హాకీ సూపర్‌-4లోనూ భారతజట్టు అదే జోరును కనబర్చింది. గ్రూప్‌-బిలో వరుసగా మూడు విజయాలతో సూపర్‌-4కు చేరిన భారత మహిళలజట్టు బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కొరియాపై 4-2గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. పాల్కే, సంగీత, లాల్‌రెమిసిమి, రుతుజ ఒక్కో గోల్స్‌ కొట్టారు. మ్యాచ్‌ ప్రారంభమైన 2వ ని.లోనే పాల్కే గోల్‌ చేయడంతో భారత్‌ 1-0 ఆధిక్యతలోకి నిలిచింది. కానీ రెండో అర్ధభాగంలో ఏ జట్టూ గోల్‌ చేయలేదు. మూడో క్వార్టర్‌లో భారత్‌ 2గోల్స్‌, కొరియా ఒక గోల్‌ కొట్టాయి. సంగీత(32వ ని.లో), లాల్‌రిమిసిమి(40వ ని.లో) ఒక్కో గోల్‌ కొట్టారు. మరోవైపు కొరియా తరఫున కిమ్‌ యు(33వ ని.లో) ఒక గోల్‌ చేయడంతో భారత్‌ 3-1గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. నిర్ణయాత్మక నాల్గో, చివరి క్వార్టర్‌లో కిమ్‌ యు(53వ ని.లో) మరో గోల్‌ చేయడంలో భారత్‌ ఆధిక్యత 3-2గోల్స్‌ ఆధిక్యతకు తగ్గింది. మ్యాచ్‌ ముగియడానికి ఒక్క నిమిషం ముందు రుతుజ గోల్‌ చేయడంలో భారత్‌ 4-2గోల్స్‌తో విజయ ఢంకా మోగించింది. గురువారం భారతజట్టు ఆతిథ్య చైనాతో తలపడనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad