- Advertisement -
ప్రశంసా పత్రాలు అందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆద్వర్యంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్,నీతి అయోగ్,చాంపియన్ చాలెంజ్ లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్ అవార్డులను మండలానికి చెందిన ఐదుగురు మహిళా ఉద్యోగులు దక్కించుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మంగళవారం తన కార్యాలయంలో అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలు,ప్రశంసా పత్రాలను అందించారు. ఈ అవార్డ్ అందుకున్న వారిలో వారిలో గుమ్మడి వల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మధుళిక,ఐసీడీఎస్ గ్రేడ్ 1 సూపర్వైజర్ సౌజన్య, టీచర్ టీ.లక్ష్మి,ఆయా రాజేశ్వరి,ఆశా సుభాని ఉన్నారు.
- Advertisement -