– జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళి గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్లు దుకాణాల్లో శాంపిళ్ల సేకరణ కార్యక్రమాన్ని తక్షణం నిలిపివేయాలని జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో ఉండే గౌడ కులస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కళ్ళు దుకాణాలలోకి అధికారులు వచ్చి కళ్లు సీసాలు (శాంపిళ్లు) సేకరిస్తు గౌడ్స్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కళ్లు సీసాల శాంపిల్ల సేకరణ పేరుతో దుకాణాలపై దాడులు చేస్తే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలన్నారు. జై గౌడ ఉద్యమం ఎప్పటికీ రాజీ పడదని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమని రంగోళ్ల మురళి గౌడ్ హెచ్చరించారు.
కల్లు దుకాణాల్లో శాంపిల్ సేకరణ వెంటనే నిలిపివేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



