Thursday, July 31, 2025
E-PAPER
Homeఖమ్మంసంపూర్ణత అభియాన్ ఆకాంక్ష మేళ..

సంపూర్ణత అభియాన్ ఆకాంక్ష మేళ..

- Advertisement -

హాజరైన ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట

‘ఆకాంక్ష మేళ’ అనేది నీతి అయోగ్ యొక్క ‘ఆకాంక్ష’ బ్రాండ్ క్రింద ప్రారంభించబడిన దేశవ్యాప్త కార్యక్రమం అని, దీని ప్రధాన లక్ష్యం ఆకాంక్ష జిల్లాల,మండలాల నుండి వచ్చే స్థానిక ఉత్పత్తులు,చేతివృత్తుల ఉత్పత్తులు,స్వయం సహాయక బృందాల, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు తయారుచేసిన వస్తువులను ప్రోత్సహించే బృహత్తర కార్యక్రమం అని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.

నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని రైతు వేదిక లో బుధవారం ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘ సభ్యులు చే తయారు చేయబడిన ఉత్పత్తుల ప్రదర్శన ను ఆయన సందర్శించారు. అయిదు మండలాల స్వయం సహాయ సంఘాల సభ్యులుచే తయారు చేసిన ఫుడ్ (స్వీట్ & షాట్స్),పౌడర్స్ (మొరింగా, చిల్లీస్ విత్ గ్రౌండ్  నట్),పచ్చళ్ళు,క్లాత్ మెటీరియల్ (డ్రెస్సెస్,శారీస్),నర్సరీ,వెదురు ఐటమ్స్,నెయ్యి,స్నాక్స్, మునగాకు పొడి, ఔషధ మొక్కల ప్రదర్శనను తిలకించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ ,ఇంచార్జి డీపీఎం ప్రత్యేక అధికారి ఎల్.వెంకయ్య,లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి,ఇండిస్ట్రియల్ సూపరింటెండెంట్ పృథ్వి,సెర్ప్ స్థానిక ఏపీఎం వెంకటేశ్వరరెడ్డి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -