-ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ధర తగ్గించాలి
-బి ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలం, పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లకు తరలిస్తున్న ఇసుక పక్కదారి పడుతుందని బి ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు. సోమవారం హుస్నాబాద్ బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇసుక వ్యాపారులు హుస్నాబాద్ చుట్టుపక్కల, పట్టణంలో ఇసుక డంపులు చేసి అధికారుల అండదండలతోనే ఇల్లు కట్టుకునే పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారన్నారు.
ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు బేస్మెంట్ లేవల్ వరకు కనీసం మూడు ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక అవసరం ఉంటుందని, ఇసుకకు ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.6 వేలు తీసుకుంటున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కు ట్రిప్పుకు రూ.1400లకే ఇసుకలో అందించాలని అన్నారు. మంత్రి పొన్నముకు సమీపంగా ఉన్నవారు కూడా ఈ దందాలో పాత్ర ఉన్నట్టు తెలుస్తుందన్నారు. వెంటనే ఇట్టి విషయంలో ఆర్డిఓ తో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మారిశెట్టి సుధాకర్, ఎలగందుల శంకర్, జిల్లా ఇన్చార్జ్ డేగల వెంకటేష్, నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, హుస్నాబాద్ మండల అధ్యక్షులు దుండ్ర రాంబాబు తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ పేరిట పక్కదారి పడుతున్న ఇసుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES