- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : మండలం బాదంపల్లిలో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక కుప్పలను సీజ్ చేశామని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భానుచందర్ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అవసరం ఉన్నవారు తహశీల్దార్ అనుమతి తీసుకోవాలన్నారు. విచ్చలవిడిగా గ్రామాల్లో ఇసుక కుప్పలు వేసుకొని అధిక ధరలకు అమ్ముకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాక్టర్ యజమానులు అక్రమంగా నిలువలు ఉంచితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నామన్నారు. సీజ్ చేసిన ఇసుకను త్వరలో వేలం వేస్తామన్నారు. తక్కువ ధరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు విక్రయిస్తామన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.
- Advertisement -