మామూళ్ళ మత్తులో జోగుతున్న సంబంధిత అధికారులు
అధికార నాయకుల అండదండలతో ఇసుక స్మగ్లింగ్
బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్
నవతెలంగాణ – కాటారం
తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిష్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత మండలం కాటారంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నదని, కాటారం బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు రామిళ్ల కిరణ్ ఆరోపించారు. మంగళవారం కాటారం మండలంలోని, పలు గ్రామాల్లో ఇసుక డంపులున్నాయనే సమాచారంతో అక్కడికే వెళ్లి మీడియా ముఖంగా మాట్లాడారు. మంత్రి ఇలాఖా అయిన కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామం మానేరు నుండి అక్రమంగా ఇసుక రవాణా యథేచ్చగా కోన సాగుతుందని తెలిపారు.
దీనికి నిలువెత్తు సాక్ష్యాలు ఈ ఇసుక డంపులని పేర్కొన్నారు. అర్థరాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపు చేసి, పగలంతా అక్రమంగా ఇసుకను వరంగల్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు లారీల ద్వారా జీరో ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ ఇసుక దందా వ్యవహారం అధికార పార్టీ నాయకుల అండదండలతోనే నడుస్తున్నదని, త్వరలోనే అన్ని ఆధారాలతో నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఇంతలా బహిరంగంగా ఇసుక డంపులు దర్శనమిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని బట్టి సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగు తున్నట్లుగా అర్థమవుతున్నదని రామిళ్ల కిరణ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు ఉప్పు సంతోష్, మనేం రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మండలంలో జోరుగా ఇసుక మాఫియా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES