- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని చిల్వేర్ గ్రామ శివారులోని దుందుభి వాగు నుండి అనుమతి లేకుండా ఇసుకను రాత్రిపూట డంపు చేసి ఇతర జిల్లాలకు ఇసుకాసురులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచి నాగరాజు గౌడ్, వార్డు మెంబర్లు, రైతులు రెవిన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఇసుక డంపులను పరిశీలించారు. అనంతరం ఇసుక డబ్బలను సీజ్ చేసినట్లు తహసిల్దార్ స్వప్న తెలిపారు.
- Advertisement -



