Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక టిప్పర్ పట్టివేత

ఇసుక టిప్పర్ పట్టివేత

- Advertisement -

 నవతెలంగాణ – భీంగల్ 
ఈనెల 20వ తేదీన అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలించే క్రమంలో భీంగల్ పోలీస్ లు శనివారం రాత్రి సమయం లో భీంగల్ మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దేవన్‌పల్లి నుండి భీమ్‌గల్ వైపుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ AP25 W8286 లో ఇసుకను లోడ్ చేసి, అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇసుక లోడ్ తో ఉన్నా టిప్పర్ తో పాటు యజమాని మామిడి షోకత్, డ్రైవర్ ఉప్పు సతీష్ ను పట్టుకొని పత్రాలు అడగగా, సమాధానం చెప్పకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తరలించి,అక్రమ ఇసుక రవాణా కేసులో ఇద్దరు వ్యక్తుల మీధ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనది. భీంగల్ మండలం లో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కే సందీప్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -