– రైతులకు పంట నష్టం చెల్లించాలి
– ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరుదల కారణంగా మండలంలో వందల ఎకరాలలో వరి పంటలలో ఇసుక మెట్లు పెట్టాయని ఇసుక మేట్లను ఉపాధి హామీ పథకంలో పెట్టి తొలగించాలని ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఇసుక మేట్లు వేయడంతో ఈ సీజన్ లో పంటలు దెబ్బతినడమే కాకుండా రాబోయేసీజన్ లో సైతం పంటలుసాగుచేయలేని పరిస్థితి నెలకొందన్నారు. భారీ మొత్తం లో ఇసుక పేరుకపోవడం తో ఇసుకను తొలగించడానికి రైతులకు చాలా ఇబ్బంది పడతారని అన్నారు. ఇప్పటికే రైతులకు సకాలంలో యూరియా దొరకక పంటలు ఎర్రబడి తీవ్రమనోవేదనతో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి ఉపాధి హామీ పథకం లో ఇసుక ను తొలగించాలని, ప్రభుత్వ పంట నష్టం చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు.