Tuesday, December 2, 2025
E-PAPER
Homeఖమ్మంఇసుక వాహనం సీజ్

ఇసుక వాహనం సీజ్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎటువంటి ఆధార పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్.హెచ్.ఓ ఎస్ఐ టి.యయాతి రాజు తెలిపారు. సోమవారం మండలంలోని ఊట్లపల్లి సమీపంలో ఎస్ఐ యయాతి రాజు నేతృత్వంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆంధ్ర నుండి అక్రమంగా  తరలిస్తున్న ఇసుక టిప్పర్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొవ్వూరు నుండి టిప్పర్ లో ఇసుకను దమ్మపేట కు తరలిస్తున్నట్టుగా విచారణలో తేలింది అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -