Wednesday, December 10, 2025
E-PAPER
Homeజాతీయంవందేమాతర గేయాన్ని మత ఆయుధంగా మార్చేలా 'సంఘ్‌' కుట్ర

వందేమాతర గేయాన్ని మత ఆయుధంగా మార్చేలా ‘సంఘ్‌’ కుట్ర

- Advertisement -

ఈ గేయం జాతీయ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తుంది : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

వందేమాతరం మనకు గొప్ప జాతీయ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తుందని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్‌ అన్నారు. రాజ్యసభలో మంగళవారం వందేమాతరంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వందేమా తరం గేయాన్ని సంఫ్‌ు పరివార్‌ మతత త్వానికి ఆయుధంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ”భారత్‌ మాత ఎవరు ? అనే ప్రశ్నతలెత్తుతోందని అన్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో తమ పిల్లలను పోషించడానికి ఇబ్బంది పడుతున్న తల్లులు, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే తల్లులు, బుల్డోజర్లతో తమ ఇండ్లను కూల్చివేయడంతో చలిలో వీధుల్లో పడిన తల్లులు భారత్‌మాతలని అన్నారు. రైతుల పోరాట సమయంలో వారు నాసిక్‌ నుంచి ముంబయికి, అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి కాలినడకన నడిచారని తెలిపారు. ”మనమందరం భారత్‌ మాత బిడ్డలం” అని నెహ్రూ అన్నారని చెప్పారు. ”వందేమాతరంలో ప్రస్తావించిన ‘స్వచ్ఛóమైన నీరు’ ఎక్కడీ గంగా, యమున చెత్తతో నిండి ఉన్నాయి. ‘సుఫల్‌’ ఎక్కడీ ఆపిల్‌ రైతులు, దానిమ్మ రైతులకు సరైన ధర లేదు. మార్కెట్లో ధర భరించలేనిది. మార్కెట్లో పండ్లు రసాయనాలతో నిండి ఉన్నాయి. ‘మలయజ శీతలాం సస్యశ్యామలం’ కూడా విదేశీయులదే. దేశ రాజధాని గ్యాస్‌ చాంబర్‌గా మారింది. ఢిల్లీ వాసులు అత్యంత కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు. కేంద్ర ప్రాజెక్టు కోసం అండమాన్‌లో కోటి చెట్లను నరికివేస్తున్నారు” అని అన్నారు. ”వందేమాతరం అనేది మధురమైన భాష అని చెబుతున్నారు. కానీ గాడ్సే వారసులు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఆహారం పేరుతో, రచన మతం పేరుతో ప్రజలను చంపుతున్నారు. గౌరీ లంకేశ్‌, దభోల్కర్‌, పన్సారే లందరినీ చంపారు. రచన పేరుతో వారిని జైలులో పెడుతున్నారు. ఆనంద్‌ తేల్తుంబ్డే, ప్రబీర్‌ పుర్కాయస్థ, స్టాన్‌ స్వామి, తీస్తా సెతల్వా ద్‌లను జైలులో పెట్టారు. వందేమాతరం అనేది జాతీయ గేయం. కానీ గాడ్సే వారసులు వందేమాతరంను మతం పేరుతో చిత్రీకరిస్తున్నారు. మనది భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వారసత్వం. ఇది 16 ఏండ్ల వయసులో బ్రిటీష్‌ జెండాను కూల్చివేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన హరి కిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ వారసత్వం. ఇది స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా జైలులో ఉన్న ఎకె గోపాలన్‌ వారసత్వం. జాతీయ పోరాటానికి ద్రోహం చేసిన సావర్కర్‌ వారసత్వం కాదు. సావర్కర్‌, మౌదుడి అనుచరులపై పోరాటం కొనసాగాలి” అని శివదాసన్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -