కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నవతెలంగాణ – మియాపూర్
పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యం పట్ల చీకటి తల తీసుకోవాలని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. చందనగర్ సర్కిల్ మియాపూర్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి పారిశుధ్య సూపర్ వైజర్లతొ కలిసి పి పి ఈ కిట్ల ను పారిశుధ్య సిబ్బందికి బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, అన్నికాలాల్లో విధులను నిర్వహించే సందర్భంగా పారిశుధ్య సిబ్బంది పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి అన్నివిధాలుగా ఉపయోగపడే విధంగా సబ్బులు, నూనె, శానిటైజర్, మాస్కులు, టోపీలు, గ్లౌజులు మొదలైన వస్తువులతో కూడిన వ్యక్తిగత రక్షణ పరికరాలతో కూడిన కిట్‌లను జీహెచ్‌ఎంసీ పారిశుద్యసిబ్బందికి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున వాటిని ఈ రోజు పారిశుద్ధ్య సిబ్బందికి పంపిణీ చేయడం జరిగినదని, సమయానుకూలంగా కిట్‌లోని రక్షణ వస్తువులను వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విధులను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సూపర్ వైజర్ లు కనకరాజు, మహేష్, ఆగమయ్య, వినయ్, తదితరులు పాల్గొన్నారు.