Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సన్ షైన్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – చండూరు 
స్థానిక సన్ షైన్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగను ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు, హరిదాసుల వేషధారణలు, గంగిరెద్దుల వేషధారణలు రైతు కుటుంబం వేషధారణలో విద్యార్థినీ విద్యార్థులు అలరించారు. రంగురంగుల రంగులతో విద్యార్థినులు రంగ వల్లులను తీర్చిదిద్దిన విధానం అబ్బురపరిచింది విద్యార్థులు గాలిపటాలను ఆకాశంలో ఎగురవేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. హరిదాసుల వేషధారణ, గంగిరెద్దుల వేషధారణ, రైతు కుటుంబం వేషధారణలో విద్యార్థులు అద్భుతమైన కళా ప్రదర్శనను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. పాఠశాలలో గ్రామీణ వాతావరణాన్ని ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగను భోగి మంటల ద్వారా ఎలా జరుపుకుంటారు. విద్యార్థిని విద్యార్థులకు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ, ప్రిన్సిపాల్ రవికాంత్, రమేష్, లతీఫ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -