నవతెలంగాణ – కామారెడ్డి
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలను ముందస్తుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్షర ఉన్నత పాఠశాల అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో రంగు రంగుల ముగ్గులతో పాఠశాల ప్రాంగణం ను అందంగా తీర్చిదిద్దారు. చిన్నారులు గోదాదేవి, వేంకటేశ్వర స్వామి, హరిదాసు వేషధారణ, పండుగ పిండి వంటలతో, రైతులు తమ పంట పొలాలో వేసే వరినట్లు వేసి గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అశోక్ రెడ్డి, కరెస్పాండెంట్ లోకేశ్ రెడ్డి, డైరెక్టర్ దేశిరెడ్డి సంగీత రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
అక్షర పురంలో సంక్రాంతి సంబురాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



