- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని శ్రీ భాష్యం పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి పర్వదిన సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల వద్ద విద్యార్థులు పతంగులను ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థినిలు అందంగా తమ ప్రతిభతో ముగ్గులను వేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులను అందించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ భూస రత్నాకర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -



