Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిఆర్ఎమ్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహణ 

జిఆర్ఎమ్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహణ 

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
జి ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎల్లమ్మ గుట్టలో గల ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు హాజరవగా రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఐటిఐ లెక్చరర్ ఉమ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తొలుత అతిథుల ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేసి పాలు పొంగిచారు. తర్వాత చిన్నారులకి భోగి పళ్ళు పోసి వారిని ఉత్సాపరిచారు. తదనంతరం గంగిరెద్దుల విన్యాసం ఆహుతలను అత్యంత ఆకర్షించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాదన్న గారి విఠల్ రావు గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ కార్యక్రమానికి తాను అతిథిగా రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు.

చిన్నప్పటినుంచే పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేస్తున్న పాఠశాల నిర్వాహకలని అభినందించారు. పిల్లలకు విద్యతోపాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని వారికి విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పడం కూడా ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన తెలియజేశారు. తల్లిదండ్రులను ఆదరించని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో తమ తండ్రి పేరు మీద సంస్థ ఏర్పాటు చేసి వివిధ సామాజిక కార్యక్రమాలని తన సొంత పెన్షన్ డబ్బుల తో నిర్వహిస్తున్న నరేష్ బాబు ఎంతోమందికి ఆదర్శప్రాయులని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్, ప్రధానోపాధ్యాయులు రమణ, గంగాధర్, పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -